BJP: బీజేపీ విధానాలను టీడీపీ నేతలు జీర్ణించుకోవాల్సిందే!: సోము వీర్రాజు

  • 2004లో బీజేపీకి 24 సీట్లు ఇచ్చారు
  • 20 సీట్లలో టీడీపీ వారినే ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపారు
  • 2014లో బీజేపీకి14 సీట్లు ఇచ్చి.. నాలుగు సీట్లలోనే నెగ్గనిచ్చారు
  • మీడియాతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

తాను అడిగే ప్రశ్నలకు స్పందించే వ్యక్తులు సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘2004లో చంద్రబాబునాయుడు గారు బీజేపీకి 24 సీట్లు ఇచ్చారు. కానీ, 20 సీట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారినే ఇండిపెండెంట్లుగా పెట్టారు. 2014లో టీడీపీతో పొత్తులోకి వచ్చాం. 14 సీట్లు ఇచ్చారు. నాలుగు సీట్లలోనే నెగ్గనిచ్చారు.

ఇక మొన్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 9 సీట్లు ఇచ్చారు. మూడు సీట్లలో నెగ్గాం. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. వారిని వెంటనే టీడీపీలో చేర్చుకున్నారు. ఈ విషయాలు అవునా? కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు. టీడీపీతో తాను పొత్తు వద్దనడం లేదని, పొత్తు సీట్లలో రెబల్స్ ను బరిలోకి దింపడం సబబు కాదని అన్నారు. బీజేపీ విధానాలను టీడీపీ నేతలు జీర్ణించుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News