YSRCP: వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన కోడెల కుమారుడు!

  • మనుగడ కోల్పోయే స్థితిలో వైఎస్ఆర్ సీపీ
  • జవసత్వాల కోసం నిత్యమూ అబద్ధాలు
  • ఆయన అక్రమాలను ప్రజలు మరచి పోలేదన్న కోడెల శివరాం

రోజురోజుకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూ, మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడిన వేళ, తిరిగి జవసత్వాలను కూడగట్టుకునేందుకు నిత్యమూ వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు, యువనేత కోడెల శివరాం సంచలన ఆరోపణలు చేశారు. ఎలాగైనా ప్రజల్లోనే ఉండాలన్న కోరికతో జగన్ నానా పాట్లూ పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఈమేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన శివరాం, తండ్రి అధికారంతో జగన్ సాగించిన అరాచకాలను, అవినీతితో ఆయన సంపాదించిన డబ్బును ప్రజలింకా మరచి పోలేదని అన్నారు. పాదయాత్ర చేస్తూ, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని, ప్రజలను ఉద్ధరిస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన, సొంత మీడియాతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

  • Loading...

More Telugu News