Jagan: పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు : వైఎస్ జగన్ ఆరోపణలు

  • ‘పోలవరం’ అవినీతిపై భవిష్యత్తులో విచారణ తప్పదు
  • కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరిట దోచుకుంటున్న టీడీపీ నేతలు
  • నేను అధికారంలోకొస్తే, చంద్రబాబులా కాకుండా నిబద్ధతతో పనిచేస్తాను: వైఎస్ జగన్

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే, ఈ ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మీడియాతో చిట్ చాట్ చేసిన జగన్ ఆరోపించారు. ‘పోలవరం’ అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుందని, కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరిట టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు విపరీతంగా పెంచుతున్నారని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుల గేట్లను తెరిచి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే, చంద్రబాబులా కాకుండా నిబద్ధతతో పనిచేస్తానని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్పారు. కాగా, అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈరోజుతో ముగియనుంది.

  • Loading...

More Telugu News