Telugudesam: కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారు
- కర్నూలు జిల్లా నేతలతో ముగిసిన సమావేశం
- ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయమై నేతలతో చర్చించిన చంద్రబాబు
- ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైసీపీ
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్ పేరు ఖరారు అయింది. కాసేపట్లో కేఈ ప్రభాకర్ పేరును టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయమై కర్నూలు జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కాగా, ఈరోజు ఉదయం నుంచి రెండు దఫాలుగా కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు చర్చలు నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో చల్లా రామకృష్ణారెడ్డి, కేఈ ప్రభాకర్, శివానందరెడ్డి తదితరులతో ఈ చర్చలు జరిగాయి. చర్చల అనంతరం, ఎట్టకేలకు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది.