Chiranjeevi: యాక్షన్ ఎపిసోడ్స్ తో 'సైరా' ఫస్టు షెడ్యూల్ పూర్తి!

  • చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' 
  • పోరాట సన్నివేశాలతో షూటింగ్ మొదలు 
  • నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నయనతార ఎంట్రీ  

'సైరా' సినిమా టీమ్ ఇటీవలే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఫస్టు షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. మల్లయుద్ధం .. కత్తియుద్ధం వంటి పోరాట సన్నివేశాలను భారీస్థాయిలో తెరకెక్కించారు. హాలీవుడ్ స్టంట్ కొరియో గ్రాఫర్ 'టోనీ చింగ్' ఈ ఫైట్స్ ను డిజైన్ చేశాడు.

ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంటున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన ఫైట్స్ కి భిన్నంగా .. ప్రత్యేకంగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయని చెబుతున్నారు. రెండవ షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేశారు .. కానీ ప్రస్తుతం అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తదుపరి షెడ్యూల్ నుంచి నయనతార షూటింగులో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

More Telugu News