: మిల్లర్ సిక్సర్ కొడితే 'ట్విట్టర్' లో పడింది!


ఐపీఎల్ తాజా సంచలనం డేవిడ్ మిల్లర్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని తనవైపు మళ్ళించుకున్నాడు. సోమవారం రాత్రి బెంగళూరు జట్టుపై మిల్లర్ విరుచుకుపడిన తీరు తోటి క్రికెటర్లను సైతం అబ్బురపరిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ యజమాని విజయ్ మాల్యా సైతం మిల్లర్ ఆటను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఆ మ్యాచ్ లో ఓవైపు బెంగళూరు బౌలర్లు విసిరిన బంతులను మిల్లర్ సిక్సర్లుగా మలుచుతూ ఉంటే, ఓవైపు క్రికెటర్లు ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తించారు.

దక్షిణాఫ్రికా సహచరులు డేల్ స్టెయిన్, ఫ్రాంకోయిస్ డు ప్లెసిస్, మార్క్ బౌచర్, ఏబీ డివిల్లీర్స్ లతోపాటు, క్రికెట్ వ్యాఖ్యాతలు సంజయ్ మంజ్రేకర్, హర్షా భోగ్లే, ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు బ్రెట్ లీ, షేన్ వార్న్ తదితరులు ట్విట్టర్లో మిల్లర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News