2జీ స్పెక్ట్రం: ఏడేళ్లుగా ఎదురుచూశా.. ఒక్కరూ సాక్ష్యం తీసుకురాలేకపోయారు!: 2జీ స్పెక్ట్రం కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యలు

  • గత ఏడేళ్లుగా అన్ని పని దినాల్లో నేను కోర్టుకు వచ్చా
  • వేసవి సెలవుల్లోనూ పని చేశా
  • ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు గదిలో కూర్చున్నా
  • నేరాన్ని సాక్ష్యాధారాలతో రుజువు చేయలేకపోయారు: సైనీ

‘గత ఏడేళ్లుగా అన్ని పని దినాల్లో నేను కోర్టుకు వచ్చాను. వేసవి సెలవుల్లోనూ పని చేశాను.. ఒక్కరూ సరైన సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయారు’ అని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసు తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి  ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పదిహేడు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 1,552 పేజీల తీర్పును న్యాయస్థానం వెలువరించింది.

సాక్ష్యం కోసం తన ఎదురుచూపులు, సీబీఐ అధికారుల తీరు మొదలైన అంశాలను తన తీర్పు  ప్రతిలో ప్రస్తావించారు. ‘ఈ కేసుకు ఎంతో పాప్యులారిటీ వచ్చింది. తీర్పు కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ కేసులో ఎవరైనా సరైన సాక్ష్యం సమర్పిస్తారేమోనని ఏడేళ్లుగా ఎదురుచూశాను. ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు గదిలో కూర్చున్నాను. ఈ కేసుకు సంబంధించి ఒక్కరు కూడా సరైన సాక్ష్యాన్ని సమర్పించలేక పోయారు.

ఈ కేసుకు సంబంధించిన వదంతులు, ఊహాగానాల గురించే ప్రతి ఒక్కరూ చెప్పారు తప్పా, నేరాన్ని సాక్ష్యాధారాలతో రుజువు చేయలేకపోయారు. సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో సీనియర్ అధికారుల సంతకాలు లేవు. తుది విచారణ సమయంలో సమర్పించిన పత్రంలో అయితే, అసలు ఎవరి సంతకమూ లేదు. ఎవరూ సంతకం చేయని పక్షంలో ఆ డాక్యుమెంట్ కు విలువ ఏముంటుంది? ఈ కేసులో చాలా లోపాలు ఉన్నాయి’ అని సైనీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News