paytm: వినియోగదారుల కోసం మరో సదుపాయాన్ని తీసుకొచ్చిన పేటీఎం!

- పేటీఎం లాయల్టీ పాయింట్స్ సదుపాయం
- లాయల్టీ పాయింట్లుగా క్యాష్ బ్యాక్స్
- ఎక్కడైనా ఈ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు
భారతదేశంలో అతి పెద్ద మొబైల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వినియోగదారుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 'పేటీఎం లాయల్టీ పాయింట్స్' అనే సదుపాయాన్ని పరిచయం చేసింది. తమ ఎకో వ్యవస్థకు లోబడి ట్రాన్సా క్షన్స్ చేసినప్పుడు వినియోగదారులకు లభించే క్యాష్ బ్యాక్స్ పేటీఎం లాయల్టీ పాయింట్లుగా చేర్చబడతాయి. ఈ పాయింట్లను అవసరమైనప్పుడు ఆన్ లైన్ వేదికల నుంచి కానీ, లేదా పేటీఎం అనుమతించే 5 మిలియన్ల వాణిజ్య ఔట్ లెట్లలో కానీ రీడీమ్ చేసుకోవచ్చు. ఏ స్టోర్ లో అయినా పేటీఎం క్యూఆర్ ను స్కాన్ చేసి లాయల్టీ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.