: హెరిటేజ్ సంస్థపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
ఇద్దరు బాలల మరణానికి కారణమైందంటూ హెరిటేజ్ సంస్థపై బాలల హక్కుల సంఘం నేడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ బాలలిద్దరూ తూర్పు గోదావరి జిల్లా ఎర్రగండికి చెందినవారు. వీరిద్దరి మృతి పట్ల హెరిటేజ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బాలల హక్కుల సంఘం తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్ పై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆగస్టు 6లోగా పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. హెరిటేజ్ సంస్థ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులకు చెందినదన్న విషయం తెలిసిందే.