: ఉత్తర కొరియాలో భూ ప్రకంపనలు


ఉత్తర కొరియాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తాజాగా ఉత్తర కొరియాలో అణు పరీక్షలు జరిపినందునే ఈ భూప్రకంపనలు సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించినట్లు అమెరికా ధృవీకరించింది. గతంలో ఉత్తర కొరియా రెండుసార్లు అణు పరీక్షలు జరిపింది. కొరియాలోని ఈశాన్య ప్రాంతంలో భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News