‘కడప’: ‘కడప’ వెబ్ సిరీస్ గురించి ఇదే నా విన్నపం!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

  • ఎవరినీ కించపరచడానికి ‘కడప’ వెబ్ సిరీస్ తీయడం లేదు
  • దీని గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దు
  • ఒక దర్శకుడిగా స్పందించి తీస్తున్న వెబ్ సిరీస్ ఇది 

కడప ప్రాంతాన్నో, ప్రత్యేకమైన వ్యక్తులనో, ఒక వర్గాన్నో కించపరచడానికి తాను ‘కడప’ వెబ్ సిరీస్ తీయడం లేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు కడపలో జరిగిన కథను తెలియజెప్పేందుకు ఒక దర్శకుడిగా ఈ వెబ్ సిరీస్ ను తీస్తున్నానని చెప్పారు. తాను తీసే వెబ్ సిరీస్ గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ఇదే తన విన్నపం అని వర్మ పేర్కొన్నారు. ‘కడప’ వెబ్ సిరీస్ తర్వాత తాను మరో అంశానికి సంబంధించిన వెబ్ సిరీస్ తీస్తానని, ఆ తీయబోయే వెబ్ సిరీస్ తో ‘కడప’ వెబ్ సిరీస్ ని పోల్చితే.. ‘కడప’ వెబ్ సిరీస్ కుటుంబకథలా అనిపిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News