చంద్రబాబునాయుడు: చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతూ బూటకపు హామీలు ఇస్తున్నారు!: వైఎస్ జగన్ విమర్శలు

  • పిట్టలదొర కథను చెప్పిన జగన్ 
  • దళిత మహిళపై జరిగిన ఘటన ప్రస్తావన  
  • ప్రజాసంకల్పయాత్రలో విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తూ, అబద్ధాలు చెబుతూ బూటకపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే పిట్టలదొర కథను ఈ సందర్భంగా ఆయన ఉదాహరణగా చెప్పారు.

అలాగే, విశాఖపట్టణ జిల్లా జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనపై ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు మానవత్వం మరిచిపోయి రాక్షసపర్వం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై ఇంతటి దారుణానికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి తనకే మాత్రం పట్టనట్టుగా చంద్రబాబు వ్యవహరించడం సబబు కాదని అన్నారు.

  • Loading...

More Telugu News