అన్నపూర్ణ స్టూడియో: అన్నపూర్ణ స్టూడియోలో మళ్లీ అగ్నిప్రమాదం!
- స్టూడియో ఆవరణలోని వెనుక భాగంలో ప్రమాదం
- సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
- ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సెట్ దగ్ధం
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. స్డూడియో ఆవరణలోని వెనుక భాగంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్డూడియో సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో సంభవించిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ దగ్ధమైన విషయం విదితమే.