పూనమ్ కౌర్: గవాస్కర్ తో ఫొటో దిగిన టాలీవుడ్ భామ పూనమ్ కౌర్!

  • భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తో పూనమ్ ఫొటో
  • విశాఖలో ఇటీవల జరిగిన వన్డే చూసేందుకు వెళ్లిన భామ
  • మ్యాచ్ నిర్వాహకుల అనుమతితో గవాస్కర్ ని కలిసిన వైనం

తన అభిమాన క్రికెటర్ గవాస్కర్ తో కలసి ఫోటో దిగి తెగ ఆనందపడిపోతోంది టాలీవుడ్ భామ పూనమ్ కౌర్. ఇటీవల విశాఖపట్టణంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు వ్యాఖ్యాతల్లో ఒకరుగా గవాస్కర్ వ్యవహరించారు. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు పూనమ్ కౌర్ వెళ్లింది.

గవాస్కర్ అక్కడున్న విషయం తెలుసుకున్న ఆమె, మ్యాచ్ నిర్వాహకుల అనుమతి తీసుకుని గవాస్కర్ ని కలిసేందుకు కామెంటేటర్లు ఉండే బాక్స్ లోకి వెళ్లింది. సన్నీని ఆప్యాయంగా పలుకరించి ఆయనతో కలిసి ఓ ఫొటో దిగింది. ఈ ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పూనమ్ పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News