దిల్ రాజు: కొత్త సినిమాల పైరసీని అడ్డుకోవాలని పోలీసులకు దిల్ రాజు ఫిర్యాదు
- సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ ని కలిసిన దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ, నటుడు అల్లు శిరీష్
- చిన్నపిల్లలకు డబ్బులిచ్చి థియేటర్లలో సినిమాల రికార్డు
- బిట్ కాయిన్ రూపంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పైరసీ ముఠా
కొత్త సినిమాల పైరసీని అడ్డుకోవాలని, పైరసీ ముఠా తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని హైదరాబాద్ పోలీసులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ ని దిల్ రాజు తో పాటు ఎస్.రాధాకృష్ణ, నటుడు అల్లు శిరీష్ కలిశారు. చిన్న పిల్లలకు డబ్బులిచ్చి థియేటర్లలో సినిమాలను రికార్డు చేయిస్తున్నారని, కొత్త సినిమాల విడుదలకు ముందే బిట్ కాయిన్ రూపంలో డబ్బు చెల్లించాలని పైరసీ ముఠా డిమాండ్ చేస్తోందని దిల్ రాజు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ పైరసీ ముఠా ద్వారా సినీ రంగానికి చెందిన పలువురు బెదిరింపులకు గురయ్యారని, ఇప్పటి వరకు ముగ్గురిపై ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.