రామ్ చరణ్: ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ రామ్ చరణ్ పోస్ట్ పై ఉపాసన ప్రశంస!

  • తప్పెట గుళ్లు కళాకారులతో చెర్రీ దిగిన ఫొటోపై స్పందన
  • ముదురు రంగులు నాకు సంతోషాన్ని ఇస్తాయి
  • ఓ ట్వీట్ లో ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. భర్తకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన సందర్భాల్లో.. చెర్రీ గురించి చెప్పేటప్పుడు ‘మిస్టర్ సి’ అని ఆమె సంబోధిస్తుండటం తెలిసిందే. తాజాగా, రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఓ ఫొటోపై ఉపాసన స్పందించారు.

 ‘పిక్చర్ పర్ఫెక్ట్.. ముదురు రంగులు నాకు సంతోషాన్ని ఇస్తాయి’ అని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సెట్స్ లో తప్పెట గుళ్లు కళాకారులతో కలిసి చెర్రీ దిగిన ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ  ఫొటోలో కళాకారులు ఎరుపు. నీలం రంగుల డ్రెస్ లో ఉండగా, వారి మధ్యలో నిలబడిన రామ్ చరణ్ ఫొటోకు పోజ్ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News