చంద్రబాబు: చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకే: వైసీపీ నేత మేరుగ నాగార్జున

  • విశాఖ జిల్లా జెర్రిపోతులపాలెం ఘటనను ఖండించిన మేరుగ
  • ప్రభుత్వం చర్యలు తీసుకోదే?
  • జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం 

చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకేనని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఈరోజు మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, ఈ దారుణ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలు దళితులపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ తాము అండగా ఉంటామని ఆయన అన్నారు. కాగా, జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్న దళిత మహిళను వివస్త్రను చేశారని, దుర్భాషలాడుతూ, ఆమెపైనే కాకుండా ఇతర దళిత కులస్తులపై కూడా టీడీపీ నాయకులు దాడి చేశారని బాధితుల ఆరోపణలు. ఈ సంఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో బాధితులు నిన్న ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News