‘అజ్ఞాతవాసి’: ‘అజ్ఞాతవాసి’లో పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారు: దర్శకుడు త్రివిక్రమ్

  • ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ చాలా గొప్ప వాళ్లు
  • ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకున్నా
  • ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో త్రివిక్రమ్

‘అజ్ఞాతవాసి’లో పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారని ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఈ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తో భవిష్యత్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే తనకు గుర్తొచ్చే మాట ఎందరో ‘మహానుభావులు’ అని, ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ చాలా గొప్ప వాళ్లని, ఏ ఒక్కరూ తక్కువ కాదని అన్నారు. ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరి నుంచి తాను ఏదో ఒక విషయం నేర్చుకున్నానని, వాళ్లందరికీ తన ధన్యవాదాలని చెప్పారు.

ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన సీనియర్ నటి ఖుష్బూకు తాను కథ చెప్పడానికి వెళ్లినప్పుడు.. ‘నచ్చింది పో’ అని అన్నారని గుర్తుచేసుకున్నారు. హీరోయిన్లు కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయ్యేల్ ఏ రోజూ షూటింగ్ కు ఆలస్యంగా రాలేదని, వాళ్ల నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నానని.. ఇలా చిత్రయూనిట్ లోని ప్రతి ఒక్కరి నుంచి తాను ఎంతో కొంత నేర్చుకున్నానని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. కాగా, ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆడియో సీడీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News