ఆదినారాయణరెడ్డి: జగన్ ‘అన్న కాదు.. తాతయ్య’: టీడీపీ మంత్రుల వ్యంగ్యాస్త్రాలు

  • జగన్ పై మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
  • ప్రజలను నలభై ఐదేళ్లకే వృద్ధులను చేస్తున్న జగన్
  • జగన్ ప్రకటించిన పింఛన్ కు ఆయనా అర్హుడే

వైసీపీ అధినేత జగన్ పై మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాల వారికి నలభై ఐదు ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తానని నాడు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పింఛన్ ను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచుతానని ధర్మవరం పాదయాత్రలో జగన్ తాజాగా ప్రకటించడంపై ఆదినారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ప్రకటన ప్రకారం ఆ పింఛన్ కు ఆయనా అర్హుడని, నలభై ఐదేళ్లు ఉన్న జగన్ ‘అన్న కాదు తాతయ్య’ అని వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నలభై ఐదు సంవత్సరాలకే ప్రజలను వృద్ధులను చేసిన ఘనత జగన్ కే చెల్లిందని వాగ్బాణాలు సంధించారు. 

  • Loading...

More Telugu News