అల్లు శిరీష్: వాళ్లిద్దరూ, నేను కలిసి ఎంతో ప్రేమతో పెరిగాం .. ఓ ఫొటో పోస్ట్ చేసిన అల్లు శిరీష్!
- అల్లు అర్జున్, రామ్ చరణ్ తో కలిసి శిరీష్ ఫొటో
- మేము ముగ్గురం కలిసి ఎంతో ప్రేమగా పెరిగాం
- ‘ఫేస్ బుక్’లో పోస్ట్ చేసిన శిరీష్
ప్రముఖ హీరో అల్లు శిరీష్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆసక్తికరంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన అన్నయ్య అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఓ ఫొటోను అల్లు శిరీష్ పోస్ట్ చేశాడు. అర్జున్, శిరీష్ భుజాలపై రామ్ చరణ్ ఆప్యాయంగా చేతులు వేసి ఉన్న ఈ ఫొటోలో .. ఈ ముగ్గురు నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ‘బన్నీ, చరణ్ తో నేను. వాళ్లిద్దరూ, నేను కలిసి, ఎంతో ప్రేమతో పెరిగాం’ అని తన పోస్ట్ లో శిరీష్ పేర్కొన్నాడు. అయితే, ఈ ఫొటో ఏ సందర్భంలో దిగిందన్నది ప్రస్తావించలేదు. కాగా, శిరీష్ నటించిన కొత్త సినిమా ‘ఒక్క క్షణం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.