బీజేపీ నేత మురళీధర్ రావు: ఎంఐఎంపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ నేత మురళీధర్ రావు
- ఎంఐఎం రజాకార్ల వారసత్వ సంస్థ .. టెర్రరిస్టులకు రక్షణ కవచం
- ముస్లిం మహిళలకు ఆ పార్టీ ఒరగబెట్టిందేమీ లేదు
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శలు
ఎంఐఎంపై తీవ్ర విమర్శలు గుప్పించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఎంఐఎం రజాకార్ల వారసత్వ సంస్థ అని, టెర్రరిస్టులకు రక్షణ కవచం అని విమర్శించారు. ముస్లిం మహిళలకు ఆ పార్టీ ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ట్రిపుల్ తలాక్ పై పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవలక్షణాలన్నీ టీఆర్ఎస్ కూ ఉన్నాయని, మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని అన్నారు. తెలంగాణలో అవినీతి, నిరుద్యోగ సమస్యలు, దళితులపై దాడులు చేయడం వంటి సంఘటనలు పెరిగిపోయాయని ఆరోపించారు. వారసత్వ, కుల, మతతత్వ రాజకీయాలకు అంతం పలికేందుకు బీజేపీ నడుం బిగించిందని అన్నారు.