యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్: నేను ఎన్టీఆర్ కు హిందీ నేర్పలేదు..సహాయపడ్డాను: యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

  • ఉదయం 5 గంటలకు కింద ఉన్న ఫోన్ మోగేది
  • ‘బ్రదర్ పైకి రండి’ అని ఎన్టీఆర్ పిలవగానే వెళ్లేవాడిని 
  • ఈవిధంగా నాలుగేళ్ల మూడు నెలలు సాగింది: యార్లగడ్డ

ఎన్టీఆర్ కు హిందీ నేర్పలేదని, నేర్చుకునే క్రమంలో ఆయనకు సహాయపడ్డానని ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ‘ఏబీఎన్-ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్టీరామారావు గారికి హిందీ నేర్పుతున్నారటగా అని నాడు చాలా మంది అడిగేవాళ్లు. వాళ్లందరికీ కూడా అదే సమాధానం చెప్పేవాడిని. ఉదయం 5 గంటలకు కింద ఉన్న ఫోన్ మోగేది. ‘బ్రదర్ పైకి రండి’ అని ఎన్టీఆర్ పిలవగానే వెళ్లేవాడిని. హిందీ పాఠం చదువుకోవడం.. ఆరు గంటల సమయంలో ఆయనతో కలిసి టిఫిన్ చేయడం.. ఈ విధంగా నాలుగేళ్ల మూడు నెలలు సాగింది. ఆయన నన్ను చాలా గౌరవంగా చూసేవారు’ అని ఎన్టీఆర్ తో గడిపిన నాటి విషయాలను లక్ష్మీప్రసాద్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News