బీజేపీ: బీజేపీకి కంగ్రాట్స్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్రబాబు

  • తాజా ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందన
  • కొత్త ప్రభుత్వాలకు ‘ఆల్ ది బెస్ట్’
  • ఓ ట్వీట్ చేసిన చంద్రబాబు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. 'గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీని అభినందిస్తున్నాను. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానున్న సందర్భంగా ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నా'నని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News