: త్వరలోనే నగరానికి నరేంద్ర మోడీ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధా(ని)న అస్త్రం, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. సభికులను ఉత్తేజపరుస్తూ, ఎంతసేపైనా విసుగు, విరామం లేకుండా, ఎక్కడా విసుగెత్తించకుండా ప్రసంగించే మోడీ.. హైదరాబాద్ లో విద్యార్థులతో మేధోమథన సదస్సులో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
మనీల్యాండరింగ్ వ్యవహారంలో రాష్ట్ర మంత్రి పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా ప్రవర్తించాల్సిన మంత్రి ఓ వ్యక్తికి వకాల్తా పుచ్చుకోవడం హేయమని వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.