‘బిజినెస్ వరల్డ్’: ’లీడర్ ఆఫ్ ది ఇయర్’ గా కేటీఆర్
- ‘బిజినెస్ వరల్డ్’ ఇచ్చే అవార్డు అందుకోనున్న కేటీఆర్
- ’లీడర్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికైన మంత్రి
- ఈ నెల 20న ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం
పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ఇచ్చే 'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఆయన్ని ఎంపిక చేసింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చేందుకు ఆయన కృషి చేశారని ఈ సందర్భంగా ఆ సంస్థ అభినందించింది.
పాలనా పరంగా ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్న తీరు, దేశ వ్యాప్తంగా మంత్రికి లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇస్తున్నామని, ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్దును ప్రధానం చేయనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంతో పాటు నిర్వహించనున్న ఐదవ జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్ కు హాజరుకావాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించామని పేర్కొంది.