నవీన్ నిశ్చల్: పది మందితో ఆ మాట అనిపించుకోవాలనేదే నా కోరిక: నవీన్ నిశ్చల్
- రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకునే తత్త్వం కాదు నాది
- రాజకీయాల్లో ఫుల్ టైమ్ పనిచేస్తా
- ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నా అలవాటు: నవీన్ నిశ్చల్
రాజకీయ రంగంలో విజయం సాధించాలని, ఆ రంగంలో తనదైన ముద్ర ఉండాలనేది తన కోరిక అని హిందూపురం వైసీపీ నేత నవీన్ నిశ్చల్ అన్నారు. ‘ఐడ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘తాత్కాలికంగా రాజకీయాల్లో ఉండి, దీనిని అడ్డం పెట్టుకుని పది రూపాయలు సంపాదించుకోవాలనేది నా కోరిక కాదు. రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉండి పనిచేస్తా. నేను చనిపోయిన తర్వాత కూడా ‘నవీన్ అనే వాడొకడున్నాడు..వాడు మాట కోసం నిలబడేవాడు’ అనేది పది మందితో అనిపించుకోవాలనేది నా కోరిక.
నేను ముక్కుసూటిగా మాట్లాడటాన్ని ‘తిక్క’ అని అంటే, అలానే పిలుచుకోవచ్చు! ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం, మనసులో ఉన్నదే పైకి మాట్లాడటం నా అలవాటు. లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ వేసే వేషాలు నేను వెయ్యలేను’ అన్నారు.