తెలుగు మహాసభలు: తెలుగు మహాసభలు... కిక్కిరిసిపోయిన రవీంద్రభారతి!

  • జంటకవుల అష్టావధానం
  • బాలకవి సమ్మేళనం
  • ఆయా కార్యక్రమాలకు హాజరైన భాషాభిమానులు, విద్యార్థులు

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలుగు భాషాభిమానులతో హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఈరోజు కిక్కిరిసిపోయింది. మహాసభల్లో భాగంగా యశోదారెడ్డి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జంటకవుల అష్టావధానాన్ని తిలకించేందుకు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ముదిగొండ అమర్ నాథ్ శర్మ, ముత్యంపేట గౌరీశంకరశర్మ జంట కవుల ఆధ్వర్యంలో అష్టావధానం నిర్వహించారు.

ఇదే ప్రాంగణంలో, ఇరుగంటి కృష్ణమూర్తి వేదికపై బాలకవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. జంట కవుల అష్టావధానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ జితేందర్ రెడ్డి, బాలకవి సమ్మేళనానికి మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News