‘పోలవరం’: ‘పోలవరం’పై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు: పురందేశ్వరి సంచలన ఆరోపణలు
- సరైన లెక్కలు పంపితే కేంద్రం నిధులు ఇస్తుంది
- కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనడం సరికాదు
- ఏపీకి ప్రత్యేకహోదా బదులు ఈఏపీ కింద నిధులిస్తుంది
- గుజరాత్ లో బీజేపీ గెలుపు ఖాయం: పురందేశ్వరి
‘పోలవరం’పై రాష్ట్ర ప్రభుత్వానివి తప్పుడు లెక్కలంటూ బీజేపీ నేత పురందేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన సరైన లెక్కలు పంపితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనడం సరికాదని, ఏపీకి ప్రత్యేకహోదా బదులు ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ) కింద నిధులు ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని పురందేశ్వరి పేర్కొన్నారు.