హిందూపురం: హిందూపురంలో బాలకృష్ణపై ఓడిపోతే అరగుండుతో ఊరేగుతా: వైసీపీ నేత నవీన్ నిశ్చల్

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తే హిందూపురం నుంచి పోటీ చేస్తా
  • బాలకృష్ణ గెలుపు గెలుపే కాదు
  • బాలయ్యపై విమర్శలు గుప్పించిన నవీన్ నిశ్చల్

వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ ఈరోజు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం వస్తే కనుక బాలకృష్ణపై నెగ్గుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై పలు విమర్శలు చేశారు. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారని, బాలకృష్ణ గెలుపు గెలుపే కాదని ఆయన విమర్శలు గుప్పించారు. 

  • Loading...

More Telugu News