: సోనియా తెలుగుజాతిని అవమానించారంటున్న నామా
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై టీడీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండడం పట్ల నామా స్పందించారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే సోనియా గైర్హాజరవడం తెలుగుజాతిని అవమానించడమే అని నామా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్ల గౌరవంతో అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైనా, సోనియా ఇలా చేయడం సరికాదని నామా హితవు పలికారు.