బొగ్గు కుంభకోణం: బొగ్గు కుంభకోణం కేసు .. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు మూడేళ్ల జైలు, జరిమానా!

  • ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పు
  • ఇదే కేసులో జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎకె బసుకు మూడేళ్ల జైలు, విసుల్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా
  • హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు

బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పునిచ్చింది. ఈ కేసులో కోడాతో పాటు కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సి గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది. ఇదే కేసులో జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎకె బసుకి మూడేళ్ల జైలు శిక్ష, కోల్ కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కు రూ.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.

వీరు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడానికి రెండు నెలల తాత్కాలిక బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. బొగ్గు కుంభకోణంకు సంబంధించి మొత్తం 30 కేసులు నమోదు కాగా, అందులో నాలుగు కేసుల్లో తీర్పు వచ్చింది.

కాగా, జార్ఖండ్ లోని ఉత్తర రాజ్ హరా బొగ్గు క్షేత్రాన్ని తమకు కేటాయించాలని 2007 జనవరి 8న విసుల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు బొగ్గు క్షేత్రం కేటాయించాలని జార్ఖండ్ ప్రభుత్వం గానీ, ఉక్కు మంత్రిత్వ శాఖ గానీ మొదట్లో అనుకోలేదు. కానీ, నాటి బొగ్గు శాఖ కార్యదర్శి గుప్తా ఆధ్వర్యంలోని 36వ ఎంపిక సంఘం మాత్రం అందుకు సిఫార్సు చేసింది. అప్పుడు, బొగ్గు శాఖను నిర్వహిస్తున్న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద వాస్తవాలను దాచిపెట్టి ఈ అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కుంభకోణంలో మధు కోడా, ఎకె బసుతో పాటు ఇతర అధికారులు కుమ్మక్కైనట్టు సీబీఐ అభియోగాలు మోపింది.

  • Loading...

More Telugu News