టీటీడీ: టీటీడీ కొత్త యోచన? సిఫారసు లేఖలపై జారీ చేసే లడ్డూల ధర పెంపు?
- ఈ నెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి?
- పెంచే ధరల ప్రకారం కల్యాణోత్సవం లడ్డు ధర రూ.200, వడ రూ.100?
- సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లో ఎలాంటి పెంపు ఉండదు?
సిఫారసు లేఖలపై జారీ చేసే తిరుపతి లడ్డూల ధరను పెంచే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. పెంచే ధరల ప్రకారం కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ, ధర రూ.100గా ఉంటుందని తెలుస్తోంది. అయితే, దర్శనం టికెట్ పై పొందే లడ్డూల ధరలు యథాతథంగా ఉంటాయని, సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లో ఎలాంటి పెంపు ఉండదని తెలుస్తోంది.