లోక్ సభ ఎంపీ: లోక్ సభ సభ్యుడు కమల్ నాథ్ కు రైఫిల్ గురిపెట్టిన కానిస్టేబుల్.. అడ్డుకున్న సెక్యూరిటీ!

  • మధ్యప్రదేశ్ లోని ఛిన్ లో సంఘటన
  • ఢిల్లీకి విమానం ఎక్కుతుండగా ఘటన
  • వెంటనే అప్రమత్తమైన కమల్ నాథ్ సెక్యూరిటీ

మధ్యప్రదేశ్ లోని ఛిన్ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ కు తన సర్వీస్ రైఫిల్ ను ఓ కానిస్టేబుల్ గురిపెట్టిన సంఘటన కలకలం రేపింది. ఛిన్ లోని విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నిన్న ఆయన వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. కమల్ నాథ్ విమానం ఎక్కుతుండగా రత్నేష్ పవార్ అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్ ను ఆయన వైపు గురిపెట్టడంతో, వెంటనే అప్రమత్తమైన కమల్ నాథ్ సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని..పక్కకు తోసేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కానిస్టేబుల్ పవార్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్టు ఏఎస్పీ నీరజ్ సోనీ పేర్కొన్నారు. కాగా, తనపై కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెక్కిన విషయం కమల్ నాథ్ దృష్టికి రాలేదు.

  • Loading...

More Telugu News