పవన్ కల్యాణ్: పవన్ కల్యాణ్ ప్రసంగం విన్నాక.. ఆయనకు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నా!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
- పవన్ కల్యాణ్ తాజా ప్రసంగాన్ని చూశా
- భిన్న అంశాలపై ఆయనకున్న దూరదృష్టి చూసి ఆశ్చర్యపోయా
- ఓ పోస్ట్ లో రామ్ గోపాల్ వర్మ
పవన్ కల్యాణ్ తాజా ప్రసంగాన్ని ఇప్పుడే తాను చూశానని, భిన్న అంశాలపై ఆయనకున్న దూరదృష్టిని చూసి ఆశ్చర్యపోయానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ వేదికగా వర్మ ఓ పోస్ట్ చేశారు. ‘పవన్ కల్యాణ్ కు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ ప్రారంభించిన వర్మ తన మార్కు వ్యాఖ్యలు చేశారు. ‘ గతం, భవిష్యత్ పై అతనికి ఉన్న స్పష్టత అమోఘం. తనపై వచ్చిన పలు వదంతులకు సవివరణ ఇవ్వడంలో ఎంతో నిజాయతీని ప్రదర్శించారు.
ఈ క్రమంలో ఆయా వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ, అతని ఆలోచనలు, భావాలను ఎటువంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయడం, ఆయన వ్యక్తిత్వంలోని కొండంత సమగ్రతకు దృష్టాంతంగా చెప్పొచ్చు. అన్నింటి కంటే ముఖ్యంగా, వ్యక్తిగతంగా చెప్పాలంటే, మాట్లాడేముందు పవన్ ఆలోచిస్తాడు, ఈ పాఠాన్ని ఆయన నుంచి నేను నేర్చుకున్నాను.
ఎందుకంటే, నాకొక స్టుపిడ్ హ్యాబిట్ ఉంది.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయకుండా.. అప్రయత్నంగానే చేసేస్తాను. అన్ని అంశాలకు సంబంధించి ఎంతో దూరదృష్టి ఉన్న పవన్ కల్యాణ్ కు నేను కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కల్యాణ్ నిలిచిపోతారని నేను భావిస్తున్నా’ అని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే, వర్మ పెట్టిన ఈ పోస్ట్ చూశాక ఇంతకీ పవన్ ని వర్మ పొగిడాడా? లేక ఇలా పొగుడుతున్నట్టు వ్యంగ్యాస్త్రం సంధించాడా? అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.