మోదీ: ‘మోదీ గుజరాత్‌ వస్తున్నారా’ అంటే ఆ కుక్క పిల్ల చేతులూపుతుంది!.. వీడియో వైరల్!

  • ‘రాహుల్ గుజరాత్ వస్తున్నారా ’ అంటే సైలెంట్ గా కుక్కపిల్ల 
  • బీజేపీ నేత అమిత్ మాల్వియా పోస్ట్ చేసిన వీడియో
  • ఆ వీడియో చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు

బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆసక్తికరంగా ఉంది. ‘అందమైన ఈ చిన్నదానికి అన్నీ తెలుసు..’ అని తన ట్వీట్ లో అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇక ఆ వీడియో గురించి చెప్పాలంటే.. ఓ కుక్కపిల్లను ఎత్తుకుని ఉన్న ఓ యువతి అడిగే ప్రశ్నలకు అది చేతులూపుతూ సమాధానం చెప్పడం సరదాగా అనిపిస్తోంది. ‘మోదీ గుజరాత్‌ వస్తున్నారా’ అంటే ఆ కుక్క పిల్ల చేతులూపుతోంది. కానీ, ‘రాహుల్ గుజరాత్ వస్తున్నారా ’ అని అడిగితే మాత్రం సైలెంట్ గా ఉండటం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటూ, కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
 

  • Loading...

More Telugu News