టీడీపీ: నిధుల విషయమై ఘర్షణ..టీడీపీ నాయకుడిని కత్తితో పొడిచిన బీజేపీ నాయకుడు!

  • కర్నూలు జిల్లా పాణ్యంలో సంఘటన
  • ఐటీడీఏ నిధుల విషయమై తలెత్తిన వివాదం
  • పుల్లారెడ్డిపై సుబ్బరాయుడు కత్తితో దాడి

ఐటీడీఏ నిధుల విషయమై తలెత్తిన విభేదాల కారణంగా చోటుచేసుకున్న ఘర్షణలో టీడీపీ నాయకుడిని బీజేపీ నాయకుడు కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో ఈరోజు జరిగింది. నిధుల విషయమై టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు పుల్లారెడ్డిపై బీజేపీ నాయకుడు సుబ్బరాయుడు కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పుల్లారెడ్డికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడికి పాల్పడ్డ సుబ్బరాయుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News