వైసీపీ అధినేత జగన్: సీబీఐ కోర్టుకు హాజరైన జగన్.. సెలవులో జడ్జి.. విచారణ వాయిదా!
- సెలవులో ఉన్న జడ్జి
- ఈ నెల 22కు కేసు విచారణ వాయిదా
- ఉప్పనాసనపల్లికి బయలుదేరిన జగన్
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా ఆయన కోర్టు ఎదుట హాజరయ్యారు. అయితే, సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి ( 22వ తేదీ) వాయిదా వేశారు. దీంతో, జగన్ వెంటనే బయలుదేరి వెళ్లిపోయారు. కాగా, అనంతపురం జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోర్టు కేసు విచారణ వాయిదా పడటంతో జగన్ అనంతపురం జిల్లా ఉప్పనాసనపల్లికి పాదయాత్ర కోసం వెళ్లారు.