చంద్రబాబు: మాల్దీవుల్లో పర్యటించనున్న చంద్రబాబు కుటుంబం
- కుటుంబంతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు
- ఈ నెల 18 నుంచి 22 వరకు మాల్దీవుల్లో పర్యటన
- అమెరికా నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లనున్న నారా లోకేశ్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన కుటుంబంతో కలిసి ప్రతి ఏటా విదేశీ పర్యటనకు వెళ్తుండటం తెలిసిందే. ఈ ఏడాది మాల్దీవులకు వెళ్లనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు పర్యటించనున్నట్టు సమాచారం. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. కాగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్, తన పర్యటన ముగించుకుని నేరుగా మాల్దీవులు చేరుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.