సీఎం చంద్రబాబు: అనవసర రాద్ధాంతం చేసే వాళ్ల బుద్ధి కుక్కతోక వంకర : సీఎం చంద్రబాబు

  • ‘పోలవరం’పై అనవసర రాద్ధాంతం చేస్తే సహించం
  • రాష్ట్రంపై విష ప్రచారం చేస్తూ..విషం గక్కుతున్నారు
  • ఈ పద్ధతి మంచిది కాదని హితవు పలికిన చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేసే వాళ్లలో మార్పు వస్తుందని అనుకుంటున్నాం కానీ, అలాంటి పరిస్థితి లేదని, వాళ్ల బుద్ధి కుక్కతోక వంకర మాదిరి ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగలేదని, వేగంగా జరుగుతున్నాయని సీఎం అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనవసర రాద్ధాంతం చేసే వాళ్ల మనసులు మారవని, రాష్ట్రంపై విష ప్రచారం చేస్తూ..విషం గక్కుతున్నారని, ఈ పద్ధతి మంచిది కాదని హితవు పలికారు. అనవసర రాద్ధాంతం చేస్తే సహించమని, అటువంటి వాళ్లకు ప్రజలే సమాధానం చెప్పాలని బాబు సూచించారు.

తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తుల పట్ల ఎప్పటికప్పుడు తమ నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ విధానాల వల్ల, పట్టిసీమ వల్ల బాగుపడ్డ రైతాంగంపై ఉందని అన్నారు. ఆరోజున పట్టిసీమ కనుక నిర్మించకపోయి ఉంటే, ఇప్పుడు కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయేదని, రైతాంగం దిగులు పడిపోయేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లుండేవి కాదని చంద్రబాబు అన్నారు. 

  • Loading...

More Telugu News