maruthi suzuki: జనవరి నుంచి పెరగనున్న మారుతి కార్ల ధరలు

- మోడల్ ను బట్టి 2 శాతం వరకు పెంపు
- విడి భాగాల ధరలు పెరగడమే కారణం
- భారం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్న మారుతి
కొత్త సంవత్సరంలో మారుతి కార్ల ధరలు పెరగనున్నాయి. మెడల్ ను బట్టి పెరిగిన ధరలు రెండు శాతం వరకు ఉంటాయని మారుతి ప్రతినిధులు చెప్పారు. విడి భాగాల ధరలు బాగా పెరిగాయని... కొంత స్థాయి వరకు ఈ భారాన్ని కంపెనీయే భరించిందని... ఇప్పుడు ఈ భారం మరింత పెరగడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్ల మీద వేయక తప్పడం లేదని వెల్లడించారు. జనవరి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు, కొత్త ఏడాదిలో ధరలు పెంచుతున్నట్టు టాటా మోటార్స్, ఫోర్డ్, హోండా, టయోటా, స్కోడా, ఇసుజు కంపెనీలు కూడా ఇప్పటికే ప్రకటించాయి.