గడ్కరీ: కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
- ‘పోలవరం’ సమస్యలు, కొత్త టెండర్లు, పనుల పురోగతిపై చర్చ
- బాబు వెంట మంత్రి దేవినేని ఉమ, సుజనా, తోట నర్సింహం
- మెట్రో రైలులో ప్రయాణించిన చంద్రబాబు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కలిశారు. ఢిల్లీలో ఆయనతో చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో సమస్యలు, కొత్త టెండర్లు, ప్రాజెక్టు పనుల పురోగతి వంటి పలు అంశాలపై గడ్కరీతో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో మంత్రి దేవినేని ఉమ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ని చంద్రబాబు కలిశారు. బాబు వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ తోట నర్సింహం ఉన్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణించారు.