జగన్: జగనన్నను సీఎంగా చూశాకే నా తుదిశ్వాస విడుస్తా: వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
- రాప్తాడ్ సెంటర్ లో బహిరంగసభ
- జగన్ పడుతున్న కష్టం సామాన్యమైంది కాదు
- ‘అనంత’కు ఫ్యాక్షన్ మరకలు అంటించింది పరిటాల: ప్రకాశ్ రెడ్డి
జగనన్నను సీఎంగా చూశాకే తన తుదిశ్వాస విడుస్తానని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాప్తాడు సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ పడుతున్న కష్టం సామాన్యమైంది కాదని, మహా మొండి మనిషని అన్నారు.
అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మరకలు అంటించడం తప్పా, ఈ జిల్లాకు పరిటాల కుటుంబం చేసింది శూన్యమని విమర్శించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అనంతపురం అద్భుతంగా ఉండేదని, ఆ రోజులు మర్చిపోలేమని అన్నారు. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ ను ధైర్యంగా ఎదుర్కొంటామని, తమ హక్కులను కాలరాసే హక్కు టీడీపీకి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.