చంద్రబాబు: పథకాలకు చంద్రబాబు పేరు పెడితే తప్పేంటి?: రోజాకు మంత్రి ప్రత్తిపాటి కౌంటర్

  • ఏపీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు
  • పథకాల పేర్ల గురించి విమర్శించే అర్హత వైసీపీకి లేదు
  • తక్కువ ధరకు ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదా? 

ఏపీలో సంక్షేమ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టడమేంటని ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు పేరును సంక్షేమపథకాలకు పెడితే తప్పేంటి? అని  ప్రశ్నించారు.

పథకాలు, వాటి పేర్ల గురించి విమర్శించే అర్హత వైసీపీకి లేదని, రేషన్ కు- చంద్రన్న మాల్స్ కు సంబంధం లేదని, ఈ విషయమై రోజా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నాణ్యమైన సరుకులను తక్కువ ధరకు ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదా? అని ప్రశ్నించిన ప్రత్తిపాటి, భారతీ సిమెంట్ ను తక్కువ ధరకు ఎందుకు అమ్మడం లేదని రోజాకు సూటి ప్రశ్న వేశారు.

  • Loading...

More Telugu News