రాజమౌళి: రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో బాలీవుడ్ భామలు?
- జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన బాలావుడ్ భామలు?
- ఎంపిక చేసే ప్రయత్నాల్లో రాజమౌళి బిజీబిజీ!
- బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రం!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటించనున్న హీరోయిన్ల విషయమై ఇప్పటికే వారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఇందులో బాలీవుడ్ భామలను ఎంపిక చేసే ప్రయత్నాల్లో రాజమౌళి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, హిందీ లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలనేది ఆయన ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్నిబాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.