శ్రీలంక: ధర్మశాల వన్డేలో రహానె ఎందుకాడలేదో నాకు తెలియదు: శ్రీలంక కెప్టెన్ పెరీరా
- ఆ విషయం చెప్పేందుకు నేనేమీ భారత సెలెక్టర్ ని కాదు
- ఈ విషయమై ఎక్కువ మాట్లాడదలచుకోలేదు
- రహానె ఓ గొప్ప ఆటగాడని పెరీరా కితాబు
భారత్ - శ్రీలంక మధ్య ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా క్రికెటర్ రహానేను ఆడించకపోవడం తెలిసిందే. ఈ విషయమై శ్రీలంక కెప్టెన్ పెరీరాను మీడియా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ‘ఆ విషయం చెప్పేందుకు నేనేమీ భారత సెలెక్టర్ ను కాదు. ఎందుకు ఆడలేదో నాకు తెలియదు. దీనిపై ఎక్కువ మాట్లాడదలచుకోలేదు. అయితే, రహానె ఓ గొప్ప ఆటగాడు’ అన్నాడు.
ఇరు జట్ల మధ్య రేపు జరగనున్న రెండో వన్డే గురించి మాట్లాడుతూ, ఈ మ్యాచ్ తాము గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటామనే విషయం ప్రతి ఒక్కరి మైండ్ లో నాటుకుపోయిందని చెప్పాడు. పెద్ద జట్లకు భారత్ లో సిరీస్ గెలవడం సాధ్యపడలేదని, అయితే, ఈ సిరీస్ ను కైవసం చేసుకుంటామనే ధీమాను పెరీరా వ్యక్తం చేశాడు.