బండ్ల గణేష్: అబ్బబ్బబ్బబ్బా...ఏంది స్వామి ఇది అదిరిపోయింది....: 'అజ్ఞాత‌వాసి'పై బండ్ల గణేష్

  • సైకిల్ పై ఉన్న పవన్ కల్యాణ్ పై ప్రశంసలు
  • ఓ ట్వీట్ లో బండ్ల గణేష్
  • జనవరి 10న విడుదల కానున్న 'అజ్ఞాత‌వాసి'

ప‌వ‌న్ క‌ల్యాణ్, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న 'అజ్ఞాత‌వాసి' సినిమా టీజ‌ర్ ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీజర్ విడుదల తేదీని తెలుపుతున్న ప్రీ లుక్ పోస్టర్ లో సైకిల్ పై ఉన్న పవన్ కల్యాణ్, తన నోటితో బెల్ట్ పట్టుకుని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఈ ప్రీ లుక్ పోస్టర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ‘అబ్బబ్బబ్బబ్బా...ఏంది స్వామి ఇది అదిరిపోయింది....’ అని తన ట్విట్టర్ ఖాతాలో బండ్ల గణేష్ తన సంతోషం వ్యక్తం చేశారు. కాగా, కొత్త ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News