రాజమౌళి: దర్శకులు ఎవరైనా రాజమౌళిని చూసి స్ఫూర్తి పొందాలి: దర్శకుడు సముద్ర
- డబ్బుకు, కమర్షియల్ చిత్రాలకే చాలామంది దర్శకుల ప్రాధాన్యత
- రాజమౌళి మాత్రం అలా కాదు
- ఓ ఇంటర్వ్యూలో సముద్ర
మనకు ఉన్న దర్శకులలో చాలామంది డబ్బుకు, కమర్షియల్ చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్నారే తప్పా, మంచి చిత్రాలు తీయట్లేదు. కానీ, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మాత్రం నైతిక విలువలను పాటిస్తూ, బిజినెస్ విలువలు పాటిస్తూ మంచి సినిమాలు తీస్తున్నారని మరో దర్శకుడు సముద్ర ప్రశంసించారు.
‘తెలుగు సినిమా అంటే ఇదీ’ అని ప్రతిసారి నిరూపిస్తూ, ఒక మెట్టుకు పైకి ఎక్కుతున్న దర్శకుడు రాజమౌళి అని అన్నారు. మంచి కథ, ఫొటోగ్రఫీ, విజువల్స్ తో ఒక మంచి సినిమాను తీయడమే కాదు దర్శకుడికి కావాల్సింది, ఆ సినిమా బిజినెస్ గురించి కూడా ఆలోచించాలని..అటువంటి దర్శకుడే గొప్ప దర్శకుడని అన్నారు. అలాంటి గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి అని అన్నారు. దర్శకులు ఎవరైనా రాజమౌళిని చూసి స్ఫూర్తి పొందాలే తప్పా, ‘ఇగో’ గా ఫీల్ కాకూడదని చెప్పుకొచ్చారు.