దర్శకుడు వి సముద్ర: ఎంజాయ్ చేయొచ్చని సినీ ఇండస్ట్రీ కు వస్తే చెడిపోతారు: దర్శకుడు సముద్ర
- సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి ఓ విషయం చెబుతా
- ప్రేమతో వస్తే బాగుపడతాం..వేరే ఆలోచనలతో వస్తే చెడిపోతాం
- ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సముద్ర
సినీ ఇండస్ట్రీకి వెళితే ఎంజాయ్ చేయొచ్చని, అవి ఇవీ దక్కుతాయని వస్తే చెడిపోతారని దర్శకుడు సముద్ర అన్నారు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి ఒక విషయం చెబుతా. ఈ ఇండస్ట్రీ చాలా గొప్పది..మంచిది. ఈ ఇండస్ట్రీని ఒక కుటుంబంలా చూడండి, ఈ తల్లిన మనం కాపాడుకోవాలి..ఎదగాలనే మంచి సంకల్పంతో సినీ ఇండస్ట్రీలోకి వస్తే సక్సెస్ అవుతాం.
అలా కాకుండా, సినీ ఇండస్ట్రీలోకి వెళితే ఎంజాయ్ చేయొచ్చని వస్తే ఎదగలేం, జీవితం నాశనమవుతుంది. సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారు మొదటగా మంచి విద్యార్హతలు సంపాదించుకుని, తల్లిదండ్రుల ఇష్టం, వారి ఆశీర్వాదంతో అడుగుపెట్టాలి. చదువును ఎంతగా గౌరవిస్తామో, సినిమాను కూడా అంత గౌరవిస్తే విజయం సాధిస్తాం. సినీ ఇండస్ట్రీలోకి ప్రేమతో వస్తే బాగుపడతాం..వేరే ఆలోచనలతో వస్తే చెడిపోతామనేది సత్యం. ఈ రంగంలో అందరికీ సక్సెస్ రాదు కాబట్టి, జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.