: దాడి గురించి అధిష్ఠానానికి ముందే చెప్పా: కొణతాల
దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం వల్ల అనకాపల్లి నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విశాఖలో చెప్పారు. దాడి వల్ల వచ్చే సమస్యల గురించి అధిష్ఠానానికి ముందే చెప్పానన్నారు. దీనిపై మళ్లీ చర్చించాల్సిందేమీ లేదన్నారు. కార్యకర్తల అభీష్ఠం మేరకు నడుచుకుంటానని చెప్పారు.