చంద్రబాబు: పెద్దాయన చంద్రబాబు అప్పగించిన పదవికి వన్నె తెస్తా: ప్రకాష్ నాయుడు

  • విద్యార్థి దశ నుంచి ‘తెలుగు యువత’ కోసం కష్టపడ్డా
  • ఎలాంటి సిఫారసు లేకుండా ఈ పదవి ఇచ్చారు
  • చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రకాష్ నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు అప్పగించిన పదవికి వన్నె తెస్తానని మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు అన్నారు. ఎలాంటి సిఫారసులు లేకపోయినా తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారని, ఆ పదవికి న్యాయం చేస్తానని అన్నారు. విద్యార్థి దశ నుంచి ‘తెలుగు యువత’లో తాను కష్టపడి పని చేశానని, చంద్రబాబు కోసం కష్టపడి పనిచేశానని చెప్పారు.

పేద రైతు కుటుంబానికి చెందిన తనను అక్కున చేర్చుకుని.. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పాటుపడతానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పాటుపడతానని అన్నారు. కాగా, ‘పెద్దాయనకు కృతజ్ఞత సభ’ పేరిట అనంతపురంలో ఆయన భారీ బహిరంగ సభ నిర్వహించారు.

  • Loading...

More Telugu News